రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ‘టక్ జగదీష్’

Tuck Jagadish Team Announce Movie Release Date,Nani’s Tuck Jagadish Finally Gets A Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tuck Jagadish,Tuck Jagadish Movie,Tuck Jagadish Telugu Movie,Tuck Jagadish Movie Updates,Tuck Jagadish Telugu Movie Latest News,Tuck Jagadish Release Date,Tuck Jagadish Movie Release Date,Tuck Jagadish Telugu Movie Release Date Locked,Tuck Jagadish Movie Release Date Fixed

‘నిన్నుకోరి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా ‘టక్ జగదీష్’. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన `ట‌క్ జ‌గ‌దీష్ ఫ‌స్ట్‌లుక్‌`కి సూపర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో జ‌గ‌దీష్ నాయుడు అనే పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు నాని.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఈ మూవీ విడుద‌ల తేదిని అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఏప్రిల్ 16 న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు. ఉగాది పండగ ఏప్రిల్ 13..పండ‌గ మూడు రోజుల తరువాత టక్ జగదీష్ థియేటర్లలో సందడి చేయనుంది. దానితో పాటు కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్ళికొడుకు గా రెడి అవుతున్న నాని లుక్ ఆకట్టుకుంటుంది.

కాగా రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు. 2021 ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 2 =