సూపర్ హిట్ “సుడిగాడు ” మూవీ తో కథానాయికగా పరిచయం అయిన మిస్ గుజరాత్ మోనాల్ గజ్జర్ , సూపర్ హిట్ “బ్రదర్ ఆఫ్ బొమ్మాళి “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. తమిళ , మలయాళ , హిందీ గుజరాతీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మోనాల్ ప్రస్తుతం ఒక హిందీ , ఒక గుజరాతీ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. రియాలిటీ గేమ్ షో “బిగ్ బాస్ 4 “లో పాల్గొని ప్రేక్షకులను అలరించిన మోనాల్ డ్యాన్స్ ప్లస్ డ్యాన్స్ షో కు జడ్జి గా వ్యవహరిస్తున్నారు. మోనాల్ ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ ” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. “అల్లుడు అదుర్స్ ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు మోనాల్ ఎంపిక అయ్యారు. ఆ స్పెషల్ సాంగ్ తో మోనాల్ ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: