మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “వైల్డ్ డాగ్ ” మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. హీరో నాగార్జున ఎన్ఐఎ ఆఫీసర్ గా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న “వైల్డ్ డాగ్ ” మూవీ 2021 సంవత్సరం ప్రథమార్థం లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో దియా మీర్జా , సయామీ ఖేర్ , అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రేయ్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సయామీ “వైల్డ్ డాగ్ ” మూవీలో RAW ఏజెంట్ గా ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ లో తన పాత్ర కై సయామీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని రిస్కీ స్టంట్స్ లో పాల్గొన్నారు. సయామీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. హీరో నాగార్జున తో నటించడం హ్యాపీగా ఉందనీ , ఆయనకు అభిమానిగా మారాననీ , నాగార్జున సార్ తో నటించడం ఒక మెమొరబుల్ ఎక్స్ పీరియన్స్ అనీ నాగార్జున పై ప్రశంసలు కురిపించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: