ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “RX 100 ” మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ , అదితి రావు హైదరి జంటగా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ “మహాసముద్రం ” మూవీ తెరకెక్కనుందని తెలిసిందే. సూపర్ హిట్ “నువ్వొస్తానంటే నేనొద్దంటానా “, “బొమ్మరిల్లు “, “జబర్దస్త్ ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్ధ్ 7 సంవత్సరాల తరువాత తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న “మహా సముద్రం “మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“గమ్యం “, “ప్రస్థానం “వంటి మూవీస్ లో పోషించిన పాత్రల వంటి ఒక బలమైన పాత్రను హీరో శర్వానంద్ “మహా సముద్రం “మూవీ లో పోషిస్తున్నారని మేకర్స్ చెప్పారు. సూపర్ హిట్ “RX 100 ” మూవీ తో పాయల్ రాజ్ పుత్ ను దర్శకుడు అజయ్ టాలీవుడ్ కు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి పాయల్ యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. పాయల్ ఇప్పుడు “మహా సముద్రం “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించనున్నారని సమాచారం. “సీత “మూవీ లో పాయల్ స్పెషల్ సాంగ్ “బుల్ రెడ్డి” లో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























