సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ‘కిక్’ శ్యామ్ అన్నదమ్ములుగా నటించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అందరినీ అలరించింది. “టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాలను.. వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించాడు సురేందర్ రెడ్డి. శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా.. సలోని, తనికెళ్ళ భరణి, పవిత్ర లోకేష్, ప్రకాష్ రాజ్, ప్రగతి, రవికిషన్, ముకేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణ మురళి, ఎం.యస్.నారాయణ కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలోమొదట స్పందనలు లేని పాత్రలో శృతీ చేసిన కామెడీ కూడా ప్రేక్షకులను మరింత నవ్వించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేసథ్యంలో శృతీ కామెడీ సీన్ మీకోసం చూసి నవ్వుకోండి.
కాగా 2014 ఏప్రిల్ 11న విడుదలై ఘనవిజయం సాధించిన ‘రేసుగుర్రం’. శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్, డా.వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఉత్తమ హాస్యనటుడు(బ్రహ్మానందం), ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్(పి.రవిశంకర్) విభాగాల్లో “నంది” పురస్కారాలతో పాటు పలు ప్రాంతీయ అవార్డులను కూడా కైవసం చేసుకుందీ సినిమా.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)