“ఝుమ్మందినాదం “(2010) మూవీ తో పంజాబీ బ్యూటీ తాప్సీ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఆడుకాలం “మూవీ తో కోలీవుడ్ లో తాప్సీ ప్రవేశించారు. తెలుగు, తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తాప్సీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సౌత్ మూవీస్ లో బిజీగా ఉండగానే “ఛష్మే బద్దూర్ ” (2013 ) మూవీ తో తాప్సీ బాలీవుడ్ లో అడుగు పెట్టారు. కమర్షియల్ చిత్రాలలో నటిస్తూనే ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “బేబీ “, “పింక్ “, “జుడ్వా 2 “, “బద్లా “, “తప్పడ్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తాప్సీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హిందీ మూవీస్ తో పాటు సౌత్ మూవీస్ కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అన్నా బెల్లె సుబ్రమణియమ్ “తమిళ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి తాప్సీ “హసీనా దిల్ రుబా “హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. తాప్సీ ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా “రష్మీ రాకెట్ ” హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. “జనగణమన “తమిళ మూవీ లో తాప్సీ కథానాయికగా నటిస్తున్నారు. హీరోయిన్ తాప్సీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. హిందీ భాష చిత్రాలకే పరిమితం కావాలని అనుకొనడం లేదనీ, దక్షిణాది ప్రేక్షకులు తన మూవీస్ ను లైక్ చేస్తారనీ, అందుకే హిందీ భాషా చిత్రాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతీ సంవత్సరం ఒక సౌత్ మూవీ లో నటించాలని అనుకొంటున్నాననీ, పలు భాషా చిత్రాలలో నటించడంతో ఒక నటిగా, ఒక మంచి మనిషిగా ఎదుగుతున్నాననీ, ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నందుకు లక్కీ గా ఫీల్ అవుతున్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: