పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్దం ” అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా అక్టోబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన అనుష్క సైన్ లాంగ్వేజ్, పెయింటింగ్స్ లో శిక్షణ తీసుకున్నారు. పూర్తిగా US లో చిత్రీకరణ జరుపుకున్న “నిశ్శబ్దం ” మూవీ లో మాధవన్ , అంజలి , షాలిని పాండే , మైఖేల్ మ్యాడ్సన్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే సందర్భంగా అనుష్క ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. నిశ్శబ్ధాన్ని శక్తివంతం చేయండి , శబ్దానికి విరామం ఇవ్వండి , నిశ్శబ్దాన్ని ప్రశంసించండి అంటూ సైన్ లాంగ్వేజ్ సింబల్స్ ఉన్న ఫొటోను అనుష్క ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ “భాగమతి ” మూవీ తరువాత అనుష్క నటించిన “నిశ్శబ్దం ” మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “నిశ్శబ్దం ” మూవీ పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: