బాలీవుడ్ మూవీ లో హీరోయిన్ గా సీరత్ కపూర్ ?

Run Raja Run Movie Fame Seerat Kapoor Is All Set To Make Her Entry In To Bollywood

మోడల్ , యాక్ట్రెస్ , డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ , క్లాసికల్ సింగర్ సీరత్ కపూర్ సక్సెస్ ఫుల్ “జిద్ ” మూవీ లో చిన్న పాత్రలో నటించి సినీ కెరీర్ ప్రారంభించారు. సూపర్ హిట్ “రన్ రాజా రన్ ” మూవీ తో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “టైగర్ “, కొలంబస్ “, “రాజు గారి గది 2”, “టచ్ చేసి చూడు ” మూవీస్ తో ప్రేక్షకులను సీరత్ కపూర్ అలరించారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన “కృష్ణ &హిజ్ లీల ” మూవీ లో సీరత్ కపూర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కృష్ణ &హిజ్ లీల ” మూవీ లో ఆధునిక భావాలు ఉన్న యువతిగా నటించిన సీరత్ “మా వింత గాథ వినుమా ” మూవీ లో సంప్రదాయాలకు విలువనిచ్చే యువతి గా నటిస్తున్నారు. “మా వింత గాథ వినుమా ” మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సీరత్ కపూర్ హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. సీరత్ ఇప్పుడు బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారని సమాచారం. టైటిల్ పెట్టని ఆ బాలీవుడ్ మూవీ లో తన క్యారెక్టర్ కు డబ్బింగ్ చెబుతున్న ఫొటో ను సీరత్ కపూర్ ఇన్ స్టా గ్రామ లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 1 =