“బ్రహ్మపుత్రుడు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన జయ ప్రకాశ్ రెడ్డి విలన్ , కామెడీ విలన్ , కమెడియన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాయలసీమ స్లాంగ్ తో డైలాగ్స్ చెబుతూ ప్రేక్షకులను అలరించారు. “ప్రేమించుకుందాం రా “,” సమర సింహా రెడ్డి “, జయం మనదేరా “, “సీతయ్య “, “ఛత్రపతి “, “గబ్బర్ సింగ్ “, “నాయక్ “, “రేసు గుర్రం “, “మనం “, “టెంపర్ “, “సరైనోడు “, “జై లవకుశ “, “సరిలేరు నీకెవ్వరు ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో జయ ప్రకాష్ రెడ్డి తన దైన స్టైల్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా మహమ్మారి కారణం గా షూటింగ్స్ లేకపోవడంతో జయ ప్రకాశ్ రెడ్డి లాక్ డౌన్ సమయం నుండీ గుంటూరు లో ఉంటున్నారు. గుంటూరు లో జయప్రకాశ్ రెడ్డి గుండె పోటు తో మృతి చెందారు. జయప్రకాశ్ మరణం తో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. జయ ప్రకాశ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. వైవిధ్య భరిత పాత్రలలో నటించే ఒక సీనియర్ నటుడు జయప్రకాశ్ ను చిత్ర పరిశ్రమ కోల్పోయింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: