#PSPK28.. ఏ అప్ డేట్ వస్తుందనుకుంటున్నారు..?

రేపు సెప్టెంబర్ 2… పవన్ అభిమానులకు ఎప్పుడూ గుర్తుండే రోజు ఇది.. ఈ రోజు కోసం ఏడాది అంతా ఎదురు చూస్తూనే ఉంటారు. ఇక పవన్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పేదేముంది. ఆయన అలా ఊరికే నడిచొచ్చినా చాలు సినిమా చూసే అభిమానులు ఉన్నారు ఆయనకు. రాజకీయాల్లోకి వెళ్తూ ఇంకా సినిమాలు చేయనని చెప్పినప్పుడు కాస్త నిరాశపడినా ఆయన సినిమాలు చేసినా.. రాజకీయాల్లో ఉన్న ఆయన వెంటే మేముంటాం అని తోడుగా ఉండే అభిమానులు ఆయన సొంతం. ఇక రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాడు అని చెప్పగానే ఫ్యాన్స్ ఆనందం అంత ఇంతాకాదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ప్రస్తుతం పవన్ మూడు సినిమాలు చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ సినిమా నుండి రేపు సాయంత్రం ఒక అప్ డేట్ రానున్న సంగతి తెలిసిందే. రేపు సాయంత్రం 4.5 నిమిషాలకు అప్ డేట్ ఇవ్వనున్నారు. అయితే ఏ అప్ డేట్ ఇస్తారన్నది మాత్రం ఇంకా సస్పెన్సే. మరి ఏ అప్ డేట్ ఇస్తారో సరదాగా మనం ఒక గెస్ కొడదాం. ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్? టైటిల్ అనౌన్స్ మెంట్? ఏ అప్ డేట్ ఇవ్వనున్నారు.. మీ ఓటు ద్వారా తెలపండి.

PSPK#28.. ఏ అప్ డేట్ వస్తుందనుకుంటున్నారు..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 6 =