పవన్ ఫ్యాన్స్ బీ రెడీ – బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్

Do Not Miss Checking Out These Back To Back Updates Lined Up About Pawan Kalyan Upcoming Movies On His Birthday

పవన్ కల్యాణ్ పుట్టిన రోజు అంటే ఆయన అభిమానులకు పండగ రోజు లాంటిదే. సెప్టెంబర్ 2 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఇక ఆ రోజు రానే వచ్చేస్తుంది. రేపు సెప్టెంబర్ 2.. పవన్ పుట్టిన రోజు. ఇక ఈ ఏడాది ఆయన అభిమానులకు ఇంకా స్పెషల్ ఎందుకంటే.. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన మొహానికి మేకప్ వేసుకోడమే కాదు.. మూడు నాలుగు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది… రెండు సినిమాలు లైన్ లో వున్నాయి. ఇక రేపు పవన్ పుట్టిన రోజు కావడంతో పవన్ అభిమానులకు వరుస అప్ డేట్స్ తో పెద్ద ట్రీట్ ఇవ్వనున్నారు. రేపు మూడు సర్ ప్రైజ్ లు రానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముందు వకీల్ సాబ్ నుండే సర్ ప్రయిజ్ రానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇక ఈ సినిమా నుండి రేపు ఉదయం 9.09 నిమిషాలకు అప్ డేట్ ఇస్తున్నట్టు ఇప్పటికే దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ ప్రకటించింది.

 

వకీల్ సాబ్ తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి కూడా ఒక అప్ డేట్ రానుంది. ఆ అప్ డేట్ ను రేపు మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఇస్తారట. ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ ను అనుకున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఆ అప్ డేట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి.

ఈ రెండు సినిమాల తర్వాత పవన్ 28వ సినిమా హరీశ్ శంకర్ తో చేస్తున్నాడు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా నుండి కూడా అప్ డేట్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు మైత్రీ మూవీ మేకర్స్ వారు. దీని అప్ డేట్ రేపు సాయంత్రం 4.05 నిమిషాలకు వుంటుంది.

 

మొత్తానికి ఒక అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న ఈ తరుణంలో బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ అంటే పవన్ ఫ్యాన్స్ కు పండగే మరి. ఇక రేపు సోషల్ మీడియాలో ఎంత రచ్చ హంగామా ఉంటుందో చెప్పడం కష్టమే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − eleven =