శివ : రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన గ్యాంగ్ స్టర్ మూవీ “శివ ” ఘనవిజయం సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా నంది ,ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ 5సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడింది. “శివ ” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన వర్మ బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. “శివ ” మూవీ హిందీ రీమేక్ తో బాలీవుడ్ కు పరిచయం అయిన వర్మ బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హలో బ్రదర్: EVV సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “హలో బ్రదర్ ” మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో హీరో నాగార్జున ద్విపాత్రాభినయం చేశారు. రెండు పాత్రలలోనూ నాగార్జున అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజ్ కోటి స్వరకల్పనలో రూపొందిన సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి.
“హలో బ్రదర్ ” మూవీ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాజ్ కోటి నంది అవార్డ్ అందుకున్నారు.
నిన్నే పెళ్ళాడతా: కృష్ణ వంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “నిన్నే పెళ్ళాడతా ” మూవీ ఘనవిజయం సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ మూవీ అద్భుత కుటుంబ కథా చిత్రం గా ప్రేక్షకాదరణ పొందింది. హీరో నాగార్జున సినీ కెరీర్ లో ఒక మైలురాయి గా నిలిచింది. సందీప్ చౌతా స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అన్నమయ్య :కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన బయోగ్రాఫికల్ ఫిల్మ్ “అన్నమయ్య “ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2 నేషనల్ , 3 ఫిల్మ్ ఫేర్ , 8 నంది అవార్డ్స్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో నాగార్జున అన్నమయ్య పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. కీరవాణి స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాగార్జున సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.
మన్మథుడు : కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ మూవీ “మన్మథుడు ” ఘనవిజయం సాధించి నాగార్జున సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకుల వీనుల విందు చేసింది. హీరో నాగార్జున పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ “మన్మథుడు ” మూవీ కి డైలాగ్స్ అందించడం విశేషం.
బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులను అలరించింది.
సోగ్గాడే చిన్ని నాయనా: కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరో గా రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్ని నాయనా ” మూవీ ప్రేక్షకాదరణ పొంది రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ లో హీరో నాగార్జున “బంగార్రాజు “పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా TSR – TV 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. అనూప్ రూబెన్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. “సోగ్గాడే చిన్ని నాయనా” మూవీ సీక్వెల్ త్వరలోనే తెరకెక్కనుంది.
[totalpoll id=”48247″]
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: