తల్లికి ప్రేమతో బర్త్ డే విషెస్..!

Actress Anushka Shetty Sends Out Birthday Wishes To Her Birthday On Instagram

టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో అనుష్క కాస్త భిన్నం అని చెప్పొచ్చు. సూపర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అంతేకాదు అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి సిరీస్, భాగమతి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే కాలక్షేపం చేస్తుంది స్వీటీ. దీనితో ఈ మధ్య కొంచం సోషల్ మీడియాలో యాక్టీవ్ అయింది.

ఇక ఈ రోజు అనుష్క శెట్టి తన తల్లి ప్రఫుల్లా శెట్టి పుట్టినరోజు కావడంతో తన తల్లికి సోషల్ మీడియాలో ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసింది. నువ్వు కేవలం ఒక తల్లి మాత్రమే కాదు.. గొప్ప మహిళవు హ్యాపీ బర్త్ డే అమ్మ అంటూ తన తల్లి ఫొటోను పోస్ట్ చేస్తూ విషెస్ చెప్పింది.

 

 

View this post on Instagram

 

You’re not just a mom, you’re the greatest women I know🥰Loving Birthday Wishes for u Amma 🥳🎂 😍

A post shared by AnushkaShetty (@anushkashettyofficial) on

దాదాపు రెండేళ్ల తర్వాత అనుష్క నిశ్శబ్దం సినిమాతో రాబోతుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల థియేటర్స్ మూత పడటంతో అన్ని సినిమాల్లాగే ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది.

ఇక ఈ సినిమాతో పాటు రీసెంట్ గా మరో సినిమాకు కూడా అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. విలక్షణ నటుడు విజ‌య్ సేతుప‌తి హీరోగా డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌.విజ‌య్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో అనుష్క హీరోగా నటిస్తున్నట్టు తెలుస్తుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here