సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ లాక్ డౌన్ లో దొరికిన ఖాళీ సమయాన్ని ఆటపాటలతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మహేష్, నమ్రత తమ సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. లాక్ డౌన్ లో స్వీట్ మెమోరీస్ అంటూ.. గతంలో తీసుకున్న కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూనే ఉన్నారు. నమ్రత ఇన్స్టా కనుక ఒకసారి చెక్ చేస్తే ఈ మధ్యకాలంలో ఎక్కువగా తను త్రో బ్యాక్ ఫొటోలే ఎక్కువగా ఉంటాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో సీతారాకు సంబంధించిన మరో త్రో బ్యాక్ పిక్ ఒకటి పోస్ట్ చేసింది. గతంలో వెకేషన్ లో వున్నప్పుడు సితార దిగిన ఫొటో ను పోస్ట్ చేసి మాన్ సూన్ కు జపనీస్ స్టయిల్ లో వెల్ కమ్ చెపుతుంది.. ఎక్కడున్నా ఫొటోను మాత్రం ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తుంది అంటూ కామెడీ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ.. తమ ముద్దుల కూతురు.. అల్లరి పిడుగు సితార గురించి ప్రేత్యేకంగా చెప్పేదేముంది. చిన్నప్పటి నుండి సితార చాలా యాక్టీవ్ అని చెప్పొచ్చు. ఈ వయసులోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు స్వయంగా ఒక యూ ట్యూబ్ ఛానల్ నే నిర్వహిస్తుంది. వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తో కలిసి పలు వీడియోలు చేస్తూ సందడి చేస్తూనే ఉంటుంది. ఆ మధ్య ఒక డిస్నీ సినిమాలో ఒక పాత్రకుగాను డబ్బింగ్ కూడా చెప్పింది. ఇలా చిన్న వయసులోనే తనలోని టాలెంట్స్ ను బయటపెడుతోంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: