మీరు ఎప్పటికీ మా జ్ఞాపకాల్లో ఉంటారు సర్..!

Anushka Shetty Remembers Legendary Director Kodi Ramakrishna

తెలుగు సినీ ప్రంపంచంలో అన్ని జోనర్లు కవర్ చేసిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ వర్సటైల్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అని చెప్పొచ్చు. కేవలం ఒక్క జోనర్ కు మాత్రమే పరిమితం కాకుండా సోషల్, హార్రర్, పొలిటికల్, డివోషనల్, గ్రాఫిక్స్ ఇలా అన్ని జోనర్లలో సినిమాలు తీసి హిట్స్ కొట్టారు. 1982 ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. ఎంతో మందిని టాప్ హీరోలుగా తీర్చిదిద్దారు. దాదాపు వందకి పైగా సినిమాలను డైరెక్ట్ చేసిన ఘనత ఆయనది. ఇక ఈ రోజు కోడి రామకృష్ణ జయంతి కావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయన్ని గుర్తుచేసుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో అనుష్క తన ఇన్స్టా వేదికగా కోడి రామకృష్ణను గుర్తుచేసుకుంది. ఆయనతో కలిసి దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ మీరు మా జ్ఞాపకాల్లో ఎప్పుడూ ఉంటారని ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరుంధతి’ మూవీతో స్టార్‌డమ్ సంపాదించుకుంది అనుష్క. ఈ సినిమాలో అనుష్క నటన అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమా దాదాపు రూ. 40 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఈసినిమా అనేక అవార్డ్స్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ హక్కులను అల్లు అరవింద్ భారీ రేటుకు కొనుగోలు చేసారట. ఈ సినిమాను హిందీలో తెలుగు దర్శకుడే డైరెక్ట్ చేస్తాడా… లేకపోతే.. హిందీ దర్శకుడు ఎవరైనా దర్శకత్వం వహిస్తారా అనేది చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.