“టక్ జగదీష్ “మూవీ అప్ డేట్

Tuck Jagadish Movie Latest Update

సూపర్ హిట్ “నిన్నుకోరి “, “మజిలీ ” మూవీస్ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నాని హీరోగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రీతూ వర్మ , ఐశ్వర్యా రాజేష్ కథానాయికలు. తమన్ సంగీతం అందిస్తున్నారు. రాజమండ్రి , పొల్లాచ్చి లలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసిన “టక్ జగదీష్ “మూవీ షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయింది .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“టక్ జగదీష్ “మూవీ ఇప్పటి వరకూ 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ సమయంలో షూటింగ్ జరిగినంత వరకూ చిత్ర నిర్మాతలు ఎడిటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేశారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోగానే బ్యాలెన్స్ షూటింగ్ ప్రారంభం కానుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన యాక్షన్ థిల్లర్ “V ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకులు రాహుల్ , వివేక్ ఆత్రేయ మూవీస్ కు హీరో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 7 =