మూడు నెలలకు పైగా సినిమాలు లేవు. షూటింగ్స్ లేవు.. దాంతో ఇంటికే పరిమితం అయిపోయారుసెలబ్రిటీస్. ఇక సమంత కూడా ఇంట్లోనే టైం పాస్ చేస్తుంది. ఇక ఈ ఖాళీ టైములో తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు గత మూడు నెలలుగా అభిమానులతో పంచుకుంటూనే ఉంది సమంత. వంటలు, యోగా, గార్డెనింగ్ ఇలా పలు విషయాలకు సంభందించిన ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంది. అంతేకాదు బయో ఎంజైములను కూడా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేర్చుకుంది కూడా. ఎలాంటి రసాయనాలు అవసరం లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోవచ్చని చెప్తుంది సమంత. ఇక సమంతకు ఈ లాక్ డౌన్ లో మంచి టైమ్ పాస్ ఏదైనా ఉంది అంటే అది తన పెట్ డాగ్ హాష్ అని చెప్పొచ్చు. తన పెట్ డాగ్ తో మంచిగా ఆడుకుంటూ స్పెండ్ చేస్తుంది. అంతేకాదు తనతో ఆడుకునే ఫొటోలు కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలో హాష్ పై కామెడీ చేస్తూ కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. తన బెడ్ మొత్తం తన పెట్ డాగ్ ఆక్రమించేసిందని…పర్సనల్ స్పేస్ అనేది తన డిక్షనరీలో లేకుండా పోయిందని అంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాతోపాటు సామ్ ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్లో కూడా నటిస్తోంది. ఇందులో విలన్ పాత్ర చేస్తుంది సామ్. మరోవైపు ఇంకా గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా తెరకెక్కుతుంది. తెలుగులో అయితే ఇంకా ఏ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టలేదు సామ్.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























