మెగాస్టార్ ఫ్యామిలిలో లిటిల్ కమెడియన్ తనే అట..!

Megastar Chiranjeevi Grand Daughter Navishka Becomes Little Comedian In The Family

లాక్ డౌన్ లో ఇంట్లో ఉన్న చిరు ఫ్యామిలీతో బాగానే కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా మనవరాలు నవిష్కతో తాను కూడా చిన్న పిల్లాడిలా మారిపోయి టైం పాస్ చేస్తున్నారు. చిరు మనవరాలు నవిష్క శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌ దంపతులకు 2018 జన్మించింది. ఇక నవిష్కకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తరచూ మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్, శ్రీజ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు తాజాగా శ్రీజ నవిష్క కు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. అంతేకాదు మెగా ఫ్యామిలీ లో నవిష్క లిటిల్ కమెడియన్ అంటూ.. తన ఎక్స్ప్రెషన్స్ తో, సౌండ్స్ తో ఇంట్లో ప్రతి ఒక్కరినీ నవ్విస్తుంది.. ఇలాంటి టైంలో డల్ గా వుండే మమ్మల్ని తన చేష్టలతో నవ్విస్తుంటుంది అని తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

కాగా ఇంతకుముందు చిరు మనవరాలు నవిష్కకు ఇష్టమైన పాట గురించి చెపుతూ ఆటపట్టించిన సంగతి తెలిసిందే. చిరు ఖైదీ నెం.150 సినిమాలోని `మిమ్మీ మిమ్మిమ్మీ` అనే పాట నవిష్కకు ఇష్టమట. ఆ పాటను పెట్టి చిరు కూడా మనవరాలిని ఒళ్లో కూర్చుపెట్టుకుని స్టెప్పులు వేసిన వీడియో అభిమానులతో పంచుకున్నారు.

కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 4 =