యంగ్ హీరో షూటింగ్ కు రెడీ

Tollywood Young Actor Naga Shaurya Gets Ready To Join Movie Shooting

బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న , ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన అంథాలజీ ఫిల్మ్ “చందమామ కథలు ” మూవీ తో నాగశౌర్య టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఊహలు గుస గుస లాడే “, “జో అచ్యుతానంద “, ” ఛలో “, “ఓ బేబీ “, “అశ్వద్ధామ ” వంటి మూవీస్ తో నాగశౌర్య ప్రేక్షకులను అలరించారు. నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంతోష్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా మెగా ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్ , దిల్ రాజు చేతులమీదుగా ప్రారంభం అయింది. విలు విద్య నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో నాగశౌర్య ప్రొఫెషనల్ ఆర్చర్ గా నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు కొన్ని రోజులు చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ ఆగస్ట్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది. తగు జాగ్రత్తలతో షూటింగ్ లో పాల్గొనడానికి నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.