సినిమా వార్తలు – వీక్లీ రౌండప్..!

TFN Weekly Roundup - Important Movie Updates

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో జరిగే ఓపెనింగ్స్, ఈవెంట్స్, ఫంక్షన్స్ , రిలీజస్ , రిజల్ట్స్ వంటి సమస్త విశేషాలను, వివరాలను “దితెలుగుఫిలింనగర్.కమ్” సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. అయితే వారం మొత్తం మీద జరిగిన విశేషాలను, మెయిన్ హైలైట్స్ ను ఈ వీక్లీ రౌండప్ లో మరోసారి మీ ముందు ఉంచుతున్నాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ప్రభాస్ 20’ ఫస్ట్ లుక్, టైటిల్

ఈ వారంలో వచ్చిన బిగ్ అప్ డేట్ ఏదైనా ఉందంటే అది ప్రభాస్ సినిమా గురించి అని చెప్పొచ్చు. ఎన్నో రోజుల నుండి ఒక్క అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక వాళ్ళు ఎదురు చూపులకు ఫలితంగా ప్రభాస్-రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ముందు నుండి అనుకున్నట్టే ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు.


నిర్మాతగా చిరంజీవి తనయ

మెగా స్టార్ చిరంజీవి తనయ సుస్మిత నిర్మాతగా మారుతుంది. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి ఒక వెబ్ సిరీస్ ను ప్రారంభించింది. పలు వెబ్ సిరీస్ లకు ప్లాన్ చేసిన సుస్మిత ఫ్యూచర్ లో సినిమాలు కూడా నిర్మించాలని అనుకొంటున్నట్టు సమాచారం.

‘కప్పేల’ రీమేక్ లో విశ్వక్ సేన్

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పేల’ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ‘ఫలక్ నుమా దాస్’, ‘హిట్’ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ శ్రీనాథ్ భాసి పాత్ర కోసం సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

‘నారప్ప’ నుండి కార్తీక్ ర‌త్నం లుక్ రిలీజ్

వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నాగా నటిస్తున్న కార్తీక్ ర‌త్నం లుక్ ను రిలీజ్ చేశారు.

5ఏళ్లు పూర్తి చేసుకున్న ‘బాహుబలి’

బాహుబలి సినిమా షూటింగ్ జూలై 6 తో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. కర్నూలులోని ప్రసిద్ధ రాక్ గార్డెన్స్ వద్ద 2013 జులై6న ప్రారంభమైంది బాహుబలి సినిమా. వేలాది మంది అభిమానుల మధ్య ఆ రోజు షూటింగ్ ను ప్రారంభించారు. ఇక ఇదే వారం బాహుబలి సినిమా రిలీజ్ ఐ ఐదేళ్లు పూర్తి చేసుకుంది. జులై 10 2015 లో బాహుబలి మొదటి పార్ట్ రిలీజ్ అవ్వగా నిన్నటితో ఐదేళ్లు పూర్తి చేసుకుంది.

 

View this post on Instagram

 

Feeling nostalgic😉 @kyarlagadda17 #5YearsOfBaahubali The Beginning

A post shared by Prabhas (@actorprabhas) on


‘మాస్టర్’ రిలీజ్ పై క్లారిటీ

లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ ‘మాస్టర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు నిర్మాత. లేట్ అయినా పర్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని…దీపావళి లేదా పొంగల్ లో ఈ సినిమా ను రిలీజ్ చేస్తాం అని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 3 =