నా సినిమా తీస్తాను.. ‘పెళ్లి గోల’ అనే టైటిల్ పెడతాను..!

Tollywood Actress Renu Desai Puts A Check To Rumors On Her Wedding Life With A Funny Counter

పెళ్లి వార్తలపై విసిగిపోయా అంటుంది రేణు దేశాయ్. పవన్ తో రేణు విడిపోయిన తర్వాత చాలా ఏళ్లు ఒంటరిగానే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోనున్నట్టు చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు ఆ ఊసే లేకుండా పోయింది. కానీ జనాలు మరిచిపోరు కదా. అందుకే రేణు ఎక్కడికి వెళ్లినా.. ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఈ ప్రశ్న లేకుండా ముగియదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు తన పెళ్లిపై వస్తున్న ప్రశ్నలపై స్పందించి కామెడీగానే కౌంటర్ వేసింది. ఇంటర్వ్యూ లో తన పెళ్లిపై ప్రశ్న అడుగగా.. ఈ ప్రశ్నకు రేణు స్పందిస్తూ.. `అందరూ నా పెళ్లి గురించే అడుగుతున్నారు. వాళ్లకి నేను పెళ్లి చేసుకున్నా ఇబ్బందే.. చేసుకోకపోయినా ఇబ్బందే. పెళ్లికి సంబంధించిన ప్రశ్నలతో విసిగిపోయాను. ఈ సందేహాలన్నింటికీ సమాధానంగా ఓ సినిమా చేస్తాను. దానికి `పెళ్లి గోల` అనే టైటిల్ పెడతాను` అని రేణు సరదాగా అన్నారు. మరి ఇకముందైనా రేణుకి ఈ ప్రశ్న తగలకుండా ఉంటదేమో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూరీ జగన్నాథ్ సినిమా బద్రితో తెలుగు తెరకు పరిచయమై.. ఇక అదే సినిమాలో హీరోగా నటించిన పవన్ ను ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్ కమ్ డైరెక్టర్ రేణు దేశాయ్. కేవలం రెండు సినిమాల్లోనే నటించిన రేణు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నేళ్లు కలిసి ఉన్న వీరు ఆ తరువాత విడిపోయారు. ఇక ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ‘‘దొంగాట’ ఫేం వంశీకృష్ణ డైరెక్షన్ లో సామాజికవేత్త, రచయిత హేమలత లవణం గారి పాత్రలో ఆమె నటించబోతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =