అర్ధ రాత్రి వర్క్ అవుట్స్..!

Actress Shruti Haasan Shares Her Midnight Post Workout Pic On Instagram

షూటింగ్స్ లేకపోవడంతో సెలబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దొరికిన సమయాన్ని తమకు నచ్చిన పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక శృతి హాసన్ కూడా దొరికిన సమయాన్ని తనకు ఇష్టమైన పనులు చేసుకుంటూ గడిపేస్తుంది. సోషల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌కు ఎప్పుడూ చేరువ‌లోనే ఉంటది. అంతేకాదు ఫిట్‌నెస్ విష‌యంలో ఏ మాత్రం అజాగ్ర‌త్త వ‌హించ‌దు. వ‌ర్కౌట్స్‌తో శ‌రీరాకృతిని మెరుగుప‌రుచుకుంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వర్క్ అవుట్ చేసిన ఫొటో అది. అయితే ఇక్కడే వుంది. వర్క్ అవుట్ చేసింది ఏ ఉదయాన్నో కాదు.. మిడ్ నైట్ వర్కౌట్ చేసి ఆ ఫోటో ను అభిమానులతో పంచుకుంది. మరి దీన్నిబట్టి చెప్పొచ్చు శృతికి ఫిట్నెస్ పై ఎంత శ్రద్దనో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన శృతి తెలుగులో క్రాక్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవితేజ పక్కా మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు అర్థమైంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.