ఓ.! సుకుమారి అందరికీ నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ –  హీరో తిరువీర్

Oh Sukumari Is a Family Entertainer Everyone Will Love says Hero Thiruveer

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్  రెడ్డి మూలి నిర్మిస్తున్నారు.  విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే  విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు  మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా  ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో తిరువీర్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ‘మసూద’ సినిమాకి, ఈ సినిమాకి కొన్ని ఆసక్తికరమైన పోలికలు ఉన్నాయి. ‘మసూద’ సినిమాను ఎస్‌వీసీ రిలీజ్ చేసింది. ఈ సినిమాను కూడా ఎస్‌వీసీనే విడుదల చేస్తోంది. అందులో నా జోడీగా నటించిన అమ్మాయి పేరు మినీ. ఇందులో నా జోడీగా నటించిన అమ్మాయి పేరు దామిని. (నవ్వుతూ) మహేశ్వర్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ సినిమా ద్వారా నాకు ఒక మంచి కుటుంబం దొరికినట్టుగా అనిపించింది. దర్శకుడు, నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇప్పుడు నాకు సొంత బ్యానర్‌లా అనిపిస్తోంది. నిన్ననే సినిమా చూశాను. ఈ సినిమాకు అసలు హీరో మా మ్యూజిక్ డైరెక్టర్ భరత్. పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. దర్శకుడు భరత్ దర్శన్‌కు, సంగీత దర్శకుడు భరత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.

నాకు చాలా మంచి సినిమా ఇచ్చారు. మా ఎడిటర్‌తో పాటు టెక్నికల్ టీమ్ అంతా ఎంతో ప్యాషన్‌తో పనిచేశారు. ఇది ప్రేమతో, కష్టపడి చేసిన సినిమా. ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఐశ్వర్య గారికి నేను అభిమానిని. ఆమెతో రెండోసారి కలిసి నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మా నిర్మాత గారికి ఈ సినిమా ద్వారా మంచి లాభాలు రావాలి. ఆయన ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో తీయాలి. మాకందరికీ రెగ్యులర్‌గా పని ఉండాలి. ఇండస్ట్రీ బాగుండాలి. థ్యాంక్యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.