రాజా ది రాజా ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది – హీరో రుత్విక్

Raja The Raja Premieres Win Over Audiences Says Hero Ruthvik

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన ‘రాజా ది రాజా’ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా భారీ స్థాయిలో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో రుత్విక్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మరికొద్ది గంటల్లో మా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మనసులో చాలా ఎగ్జైట్‌మెంట్ ఉంది. ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాను. నిన్న జరిగిన ప్రీమియర్‌కు వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది. ఆ రెస్పాన్స్ చూసి నేను చాలా అదృష్టవంతుడినని అనిపించింది. అలాంటి ప్రేమ, ఆదరణ కోసమే ఇన్నాళ్లు ఎదురుచూశాను. ఎంతో ప్రేమతో, ఇష్టంతో చేసిన సినిమా ఇది. చిన్నప్పటి నుంచి స్కూల్‌లో, కాలేజీలో ఎక్కడికి వెళ్లినా అందరినీ ఎంటర్‌టైన్ చేయాలని అనుకునేవాడిని. ఇప్పుడు ఆ కల ‘రాజా ది రాజా’ ద్వారా నెరవేరుతోంది. మీ అందరి ముందుకు హీరోగా రావడం చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది. మా అక్క, నిర్మాత నిహారికకు ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను నమ్మి ఇలాంటి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది.

నా ప్రతిభను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యు అక్క. మా దర్శకుడు అనిల్ బోయిడపు గారు చాలా క్రియేటివ్ పర్సన్. ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. మార్క్ కె. రాబిన్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మా డీవోపీ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. విశాఖ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. నరేష్ గారు, సాయికుమార్ గారు సహా ఎంతోమంది గొప్ప నటులు ఈ సినిమాలో భాగమయ్యారు. మేమంతా ఎంతో ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన నా కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది మంచి విజువల్ స్పెక్టికల్. జూలై 17న మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ థ్యాంక్యూ సో మచ్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.