వియ్యంకుడు తేజ్ కు థ్యాంక్స్.. త్వరలోనే ముహుర్తాలు..!

Tollywood Actor Manchu Manoj Pokes Fun At Sai Dharam Tej Through His Latest Post On Social Media

వియ్యంకుడు.. త్వరలోనే ముహుర్తాలు అంటేసాయి తేజ్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడేమో అని అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అసలు సంగతేంటటే.. మంచు మనోజ్ హ్యూమర్ గురించి మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఒక్కోసారి తను పెట్టె పోస్ట్ లు చాలా కామెడీ గా ఉంటాయి. తాజాగా అలాంటి ట్వీటే చేసాడు. మనోజ్, సాయి ధరమ్ తేజ్ తో కలిసి తమ పెంపుడు కుక్కులకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టాడు. సోషల్ డిస్టెన్స్ తో.. టాంగో మరియు జోయాడేట్ డే… నాకు మంచి అల్లుడు ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి ధరమ్ తేజ్ కు ధన్యవాదాలు. త్వరలోనే ముహూర్తలు పెట్టించి శుభలేఖలు వెయిస్తాం” అని సరదాగా పోస్ట్ చేస్తూ.. తమ కుక్కలతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అంతేకాదు ఇక పెళ్లికి ఎవరెవరిని పిలుస్తారో అంటూ నెటీజన్స్ కూడా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు కాగా హస్కి బ్రీడ్ కి చెందిన ఈ పెంపుడు కుక్కలను ఎంతో ఇష్టంగా ఒకేసారి తీసుకున్న ఈ స్టార్స్. అంతేకాదు వాటి మధ్య కూడా ఒక స్పెషల్ రిలేషన్ ని ఏర్పాటు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ హీరోల సినిమాల విషయానికి వస్తే.. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో బిజీ గా వున్నాడు. షూటింగ్ కూడా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాతో పాటు దేవకట్టాతో మరో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. ఇక మంచు మనోజ్ చాలా గ్యాప్ తీసుకొని అహం బ్రహ్మాస్మి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న ఈ సినిమా. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను ఎంఎం ఆర్ట్స్‌ బ్యానర్‌పై విద్యా నిర్వాణ, మంచు ఆనంద్‌ సమర్పణలో మంచు మనోజ్, నిర్మలాదేవి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 15 =