ఇలియానా అభిమతం

Kick Actress Ileana Wishes To Play Comedy Centric Roles In Her Upcoming Movies

సక్సెస్ ఫుల్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ఇలియానా పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలోనే సూపర్ హిట్ “బర్ఫీ “మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించి హిందీ మూవీస్ తో బిజీ అయ్యి టాలీవుడ్ కు దూరం అయ్యారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన ఇలియానా ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ హీరోగా రూపొందుతున్న “ది బిగ్ బుల్ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ ఇలియానా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉండగానే “బర్ఫీ “మూవీ తో బాలీవుడ్ కు వచ్చానని, ఎటువంటి మూవీ లో నైనా నటించడానికి సిద్ధమేనని, కంటెంట్ ప్రధానంగా , అద్భుతమైన క్యారెక్టర్ ఉన్న మూవీస్ సౌత్ , నార్త్ , హాలీవుడ్ లో నటించడానికి తనకు ఎటువంటి సంకోచాలు లేవని , దర్శకుడి దృష్టి కోణం లోనే నటీనటుల ఎంపిక జరుగుతుందని ,
ఏ క్యారెక్టర్ కు ఎవరు సూట్ అవుతారో వారినే దర్శకుడు ఎంపిక చేస్తారని, నటీ నటుల ఎంపిక దర్శకుడికే బాధ్యత ఉంటుందని తన అభిప్రాయం అని, ఎక్కువగా సీరియస్ మూవీస్ లో నటించానని , ఆ మూవీస్ ను ప్రేక్షకులు ఆదరించారని, ఇప్పుడు సీరియస్ ఫిల్మ్స్ కు బ్రేక్ ఇచ్చి కామెడీ ఫిల్మ్స్ లో నటించాలని కోరుకుంటున్నానని ఇలియానా తన కోరికను వెల్లడించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =