పెళ్లి ముందు పెళ్లి తర్వాత కూడా సమంత మాత్రం వరుస సినిమాలతో.. వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. ఇంట్లోనే వుంటూ అందరి సెలబ్రిటీస్ లాగే సమంత కూడా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియా లో తాను చేసే పనులకు సంబంధించి పలు వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా లో అభిమానులతో ముచ్చటించటం… ఫొటోస్, వీడియోస్ ఇలా అన్నీ విషయాలు తన అభిమానులతో పంచుకుంటూనే ఉంది. అంతేకాదు ఈ ఖాళీ సమయంలో గార్డెనింగ్, కాయగూరలు కూడా పెంచుతుంది సామ్. అప్పుడప్పుడు తాను వేసిన యోగాసనాలను సోషల్మీడియాలో పోస్టు చేస్తుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే తాజాగా మరో పోస్ట్ పెట్టింది సామ్. ఈఫొటోలో సమంత యోగా చేస్తుంది. ఇక ఫొటో పోస్ట్ చేసిన సామ్.. ‘గార్డెనింగ్ కాకుండా.. నేను ఎక్కువగా ఎంజాయ్ చేసేది యోగా. ఎందుకంటే చైతన్యతో కలిసి నేను యోగా చేస్తాను. మాకు ఒక సూపర్ బెస్ట్ ట్రైనర్కూడా ఉన్నారు. ఈ ఫొటోలో చైతు లేడు…. నేనొక్కదానే యోగా చేస్తున్నాను’ అని ఇన్స్టా ఖాతాలో పేర్కొంది. మరి సమంత కూడా ఫిట్ నెస్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో తెలిసిందే. ఇక ఇటీవలే సామ్ 48 రోజుల ఈశా క్రియ మెడిటేషన్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ యోగాసనం మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందని మనసు ప్రశాంతంగా ఉండడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని అంటుంది సామ్.
ఇక ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది సామ్. ఇందులో విలన్ పాత్ర చేస్తుంది సామ్. మరోవైపు పలు సినిమాలు కూడా చేస్తుంది. విజయ్ సేతుపతి, నయనతార మరియు సమంత ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇంకా అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా తెరకెక్కుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: