కోనేరు హవీష్.. టాలీవుడ్ లో ఈ యంగ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ‘నువ్విలా’ చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు హవీష్. ఆ తరువాత ‘జీనియస్’ మరియు ‘రామ్ లీల’ అనే చిత్రాలలో నటించినా అవి కూడా నిరాశనే మిగిల్చాయి. గతేడాది తెలుగు తమిళ భాషల్లో ‘సెవెన్’ అనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చాడు. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన లక్ ను పరీక్షించుకున్నాడు. ‘ఏ హవీష్ లక్ష్మణ్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నాడు. గత ఏడాది బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పెట్టి ‘రాక్షసుడు’ సినిమా నిర్మించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని కమర్షిల్ హిట్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రవితేజ కూడా ఒక సినిమా చేస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ హీరోగా ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్‌లో సినిమా చేస్తున్నట్టు ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఇటీవలే స్పష్టం చేశారు. ఈ చిత్రానికి ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నారు.
ఇదిలా ఉండగా ఈ రోజు హవీష్ పుట్టినరోజు ఈ సందర్భంగా తాను చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి తెలిపారు. మీడియాతో ముచ్చటించిన రెండు ప్రాజెక్ట్స్ ను లైన్ పెట్టినట్టు తెలిపాడు. అందులో ఒకటి క్రైమ్ థ్రిల్లర్ కాగా మరొకటి లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: