నయనతార సీక్వెల్ లో కీర్తి సురేష్.. అంతా అబద్దమే..!

Aramm Movie Director Quashes Rumors Of Roping In Keerthy Suresh In The Place Of Nayanthara For Aramm Movie Sequel

ఒక సినిమా హిట్ అయిందంటే దాన్ని సీక్వెల్ తీయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈ ట్రెండ్ తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమల్లో కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఎన్నో సీక్వెల్స్ వచ్చాయి.. ఇంకొన్ని సీక్వెల్స్ లైన్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో సినిమా సీక్వెల్ పై కూడా వార్తలు వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నయనతార కథానాయికగా తమిళంలో ‘ఆరమ్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తెలుగులో ఈ సినిమాను ‘కర్తవ్యం’ పేరుతో కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అంతేకాదు నయనతార పలు సినిమాలతో బిజీ గా ఉండటంతో.. ఆ పాత్రకు కీర్తి సురేశ్ ని తీసుకున్నారని కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఇక ఈ వార్తలపై స్పందించిన ‘ఆరమ్’ చిత్ర దర్శకుడు గోపీ నైనర్ క్లారిటీ ఇచ్చాడు. ‘ఈ చిత్రంపై ప్రస్తుతం వస్తున్నవన్నీ కేవలం రూమర్లు, వాటిని ఎవరూ నమ్మకండి’… ‘అసలు ఆరమ్ సీక్వెల్ ప్రయత్నాలే చేయడం లేదు. ఒకవేళ సీక్వెల్ చేస్తే కనుక నయనతారతోనే చేస్తాను. ఆమె అయితేనే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుంది… ప్రస్తుతానికి అయితే ఆ ప్రయత్నాలు ఏం చేయడం లేదు అన్నారు. మరి ఇప్పటికైనా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూద్దాం..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.