రాజమౌళి ట్రయిల్ షూట్ పై గత రెండు వారాలుగా వార్తలు వింటూనే ఉన్నాం. అయితే అప్పటి నుండి ఏదో ఒక వార్త వస్తుంది కానీ ట్రయిల్ షూట్ మాత్రం ఇంకా షురూ కాలేదు. దీని కారణాలు కూడా పలు ఉన్నాయి. రోజు రోజుకు ఇక్కడ పెరిగిపోతున్న కరోనా కేసులు ఒక కారణం అయితే.. మరో పక్క ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా షరతులతో షూటింగ్ చేయలేని పరిస్థితి. దీనితో అసలు ట్రయిల్ షూటే క్యాన్సిల్ చేశాడని వార్తలు వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ట్రయిల్ షూట్ ను వచ్చే వారం అలా చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నాడట. అంతేకాదు ఆ ట్రయిల్ షూట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ముఖ్యమైన టెక్నిషియన్స్ కూడా ఉంటారని తెలుస్తుంది. మరి ఎన్టీఆర్, చరణ్ కూడా షూటింగ్ లో పాల్గొనడం అంటే కొంచం ఆలోచించాల్సిన విషయమే. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం'(ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: