హీరో నాని ఎదురు చూపులు

Natural Star Nani Eagerly Awaits To Join Movie Shooting Post Lockdown

కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ బంద్ అయ్యి చిత్ర పరిశ్రమ కష్ట నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణం గా 2నెలల 15 రోజులు సినీ సెలబ్రిటీస్ ఇంటికే పరిమితం అయ్యారు. టాలీవుడ్ లో బిజీ హీరోలలో ఒకరైన నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ రిలీజ్ కరోనా కారణం గా వాయిదా పడింది. పలు చిత్రాలకు కమిట్ అయినా హీరో నాని షూటింగ్స్ ప్రారంభానికై ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందే అవుట్ డోర్ షూటింగ్ ముగించుకున్న “టక్ జగదీష్ ” మూవీ బ్యాలెన్స్ షూటింగ్ హైదరాబాద్ లోనే జరుపుకోనుంది. ఈ మూవీ జులై 3వ తేదీ రిలీజ్ కావాల్సిఉంది. ఈ మూవీ తరువాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో “శ్యామ్ సింగ రాయ్ “మూవీ , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక మూవీ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇన్ని రోజులు ఇంటికే పరిమితం అయిన సినీ తారలు బోర్ ఫీల్ అయ్యి షూటింగ్స్ ప్రారంభానికి ఎదురు చూస్తున్న మాట వాస్తవం. మినిమమ్ 150 మంది యూనిట్ మెంబర్స్ తో జరిగే షూటింగ్స్ సజావుగా సాగుతాయా , థియేటర్స్ ప్రారంభం అయితే ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =