[POLL]బర్త్‌డే ‘బాబు’ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.. ఈ స్టార్స్‌లో ఎవరిని డైరెక్ట్ చేస్తే చూడాలనుకుంటున్నారు?

Which Among These Stars You Would Think Can Make The Best Combination With Legendary Director K Raghavendra Rao?

కోవెలమూడి రాఘవేంద్రరావు.. తెలుగునాట కమర్షియల్ సినిమాకు కొత్త నడకలు నేర్పిన దర్శకుడు. 1975లో విడుదలైన ‘బాబు’తో నిర్దేశకుడిగా తొలి అడుగేసిన ఈ ‘గ్లామ‌ర్ స్పెష‌లిస్ట్’.. ఇటీవలే దర్శకుడిగా 45 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. ఈ నాలుగున్నర దశాబ్దాల చిత్ర ప్రయాణంలో మూడు తరాల అగ్ర కథానాయకుల కాంబినేషన్‌లో సినిమాలు చేయడమే కాకుండా.. అందరితోనూ భారీ విజయాలు అందుకున్నారాయన. తొలితరం అగ్ర కథానాయకులు నటరత్న నందమూరి తారక రామారావు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్ శోభన్‌బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు.. రెండోతరం అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ, ‘కింగ్’ నాగార్జున, ‘విక్టరీ’ వెంకటేష్, ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు.. మూడో తరం అగ్ర కథానాయకులు సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. దర్శకేంద్రుడి కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్స్‌ అందుకున్నారు. వీరిలో వెంకీ, మహేష్, బన్నీ.. కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ మూవీస్‌తోనే కథానాయకులుగా తొలి అడుగులు వేయడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీన్ని బట్టి.. అగ్ర కథానాయకులకి అచ్చొచ్చిన దర్శకుడిగా కె.రాఘవేంద్రరావుకి స్పెషల్ ట్రాక్ రికార్డ్ ఉంద‌నే చెప్పుకోవచ్చు. ఎటొచ్చి తొలి రెండు తరాల స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన రాఘవేంద్రరావు.. మూడోతరంలో మాత్రం మహేష్, బన్నీకే పరిమితం అవడం సినీ ప్రియులకు ఏదో తెలియని వెలితి. ఈ నేపథ్యంలో.. మూడోతరం అగ్ర కథానాయకులైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ యన్టీఆర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాఘవేంద్రరావు సినిమాలు చేస్తే చూడాలనేది చాలామంది అభిమానుల అభిలాష. సమీప భవిష్యత్తులో ఈ ‘గ్లామరాధిపతి’ ఆ యా స్టార్స్‌తో సినిమాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేడు ఈ దర్శకదిగ్గజం పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ది తెలుగు ఫిలిమ్ నగర్.కామ్’ ఈ విషయంపై ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోల్ గేమ్‌ను నిర్వహిస్తోంది. ‘పవన్, తారక్, ప్రభాస్, చరణ్.. వీరిలో ఎవరిని రాఘవేంద్రరావు డైరెక్ట్ చేస్తే చూడాలనుకుంటున్నారు?’ అన్నదే ఈ పోల్ గేమ్ థీమ్. మీ అభిప్రాయాన్ని మీ ఓటు ద్వారా తెలియజేసే అవ‌కాశ‌మిది. మరెందుకు ఆలస్యం.. పోల్ గేమ్‌లోకి ఎంటర్ అవుదాం.

[totalpoll id=”43610″]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.