మ్యూజిక్ టీచర్ గా ‘బుట్ట బొమ్మ’..!

Actress Pooja Hegde Plays Music Teacher In Upcoming Radha Krishna Directorial With Prabhas
Actress Pooja Hegde Plays Music Teacher In Upcoming Radha Krishna Directorial With Prabhas

జిల్ ఫేమ్ రాధాకృష్ణా దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్యాన్‌ ఇండియన్‌ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుంది. కొద్దిరోజులు షూటింగ్ జరుపుకున్నఈ సినిమా ప్రస్తుతం కరోనా వల్ల బ్రేక్ వేయాల్సి వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా కు మొదటి నుండి ‘జాన్’ అనే టైటిలే అనుకున్నారు. అయితే దిల్ రాజు 96 సినిమాకి ఈ టైటిల్ ను పెట్టేసారు. ఇప్పుడు ఈ సినిమాకు ‘ఓ డియర్’ కానీ ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారట. అయితే ఈ సినిమాకు ‘ఓ డియర్’ అనే టైటిలే సరిగ్గా సరిపోతుందని.. ఈ టైటిలే ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో పూజ హెగ్డే మ్యూజిక్ టీచర్ గా కనిపించనుందట. పీరియాడిక్ డ్రామా కాబట్టి.. అప్పటికి సంబంధించిన లుక్ తోనే పూజ కనిపించనుందని అంటున్నారు. ఇంతవరకూ పూజ చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు.

ఇక ఈ సినిమాతో పాటు పూజ హెగ్డే అఖిల్ జోడీగా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్’ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధం గా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 20 =