సోషల్ మీడియా లో ఎప్పుడు ఏం వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. కానీ ఒక్కసారి వైరల్ అయ్యిందా దానిని ఆపడం చాలా కష్టం. అలా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పాట వినవే బర్రె పిల్లా, నువ్ వినవే బర్రె పిల్లా. ఈపాట రీసెంట్ గా చాలా వైరల్ అయింది. ఇక ఈ పాటపై స్పందించింది మంచు లక్ష్మీ. సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ కాస్త యాక్టీవ్ గానే ఉంటుంది. ఏదో ఒక అప్డేట్ తో నెటిజన్లకు దగ్గరగానే ఉంటుంది. అయితే తాజాగా ఈ పాటను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది మంచు లక్ష్మీ. అంతేకాదు `ఈ పాట నా బుర్ర లోంచి వెళ్లిపోవటం లేదంటూ కామెంట్ కూడా పెట్టింది. దీనితో నెటిజన్లు కూడా కామెడీ గా రియాక్ట్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఈ బర్రె పిల్ల పాట సెలెబ్రిటీల వరకూ వెళ్లిందన్నమాట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Can’t get this song out of my head 😂😂vinnavey barri pilla 🐃 pic.twitter.com/HQ58Ufq0ec
— Lakshmi Manchu (@LakshmiManchu) April 21, 2020




ఇక మోహన్ వారసురాలిగా మంచు లక్ష్మీ పలు సినిమాల్లో నటించింది. అయితే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ తన కూతురితో కలిసి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తోంది. ఇప్పటికే పలు వీడియోలు మంచి రెస్పాన్సే వచ్చింది. అంతేకాదు తన కూతురితో పాటలు కూడా పాడిస్తుంది.తాజాగా కరోనా విషయంలో అవగాహన కలిగించేందుకు తమ్ముడు మంచు విష్ణు.. తన కూతురు పాట పాడగా దానిని మంచు లక్ష్మీ భర్త నిర్మించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: