డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హారిక &హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా “ఎన్టీఆర్ 30” మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరోయిన్ గా పూజాహెగ్డే, కియారా అద్వానీ పేర్లు వినిపించాయి. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెర మీదకు వచ్చింది. “రామయ్యా వస్తావయ్యా ” మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా నటించిన శృతి హాసన్ “ఎన్టీఆర్ 30” మూవీలో ఎన్టీఆర్ తో జత కట్టనుందని సమాచారం. రెండవ హీరోయిన్ గా నివేత పేతురాజ్ నటించే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: