య‌న్టీఆర్ ‘ఆలీబాబా 40 దొంగలు’కు 50 వ‌సంతాలు

NTR Cult Classic Alibaba Nalabai Dongalu Completes 50 Years

మ‌హాన‌టుడు య‌న్.టి.రామారావుకు బాగా క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల్లో “జాన‌ప‌ద‌ బ్రహ్మ” బి.విఠ‌లాచార్య ఒక‌రు. వీరిద్ద‌రి క‌ల‌యిలో వ‌చ్చిన చిత్రాలలో సింహభాగం ఘ‌న విజ‌యం సాధించిన‌వే కావ‌డం విశేషం. వాటిలో ‘ఆలీబాబా 40 దొంగ‌లు’ ఒక‌టి. వీర‌, శృంగార, హాస్యర‌స ప్ర‌ధానంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో య‌న్టీఆర్‌కు జోడిగా జ‌య‌ల‌లిత న‌టించారు. శ్రీ గౌత‌మ్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత య‌న్.రామ‌బ్ర‌హ్మం నిర్మించిన ఈ సినిమాలో స‌త్య‌నారాయ‌ణ‌, నాగ‌భూష‌ణం, మిక్కిలినేని, అల్లు రామ‌లింగ‌య్య‌, రాజ‌బాబు, రావి కొండ‌ల‌రావు, సూర్య‌కాంతం, హేమ‌ల‌త‌, ర‌మాప్ర‌భ ముఖ్య భూమిక‌లు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డా.సి.నారాయ‌ణ రెడ్డి, కొస‌రాజు, దాశ‌ర‌ధి గీత ర‌చ‌న‌కు.. దిగ్గ‌జ గాయ‌కుడు ఘంట‌సాల స్వరాలు స‌మ‌కూర్చారు. “నీలో నేనై నాలో నీవై”, “అల్లా యా అల్లా”, “చ‌ల్ల చ‌ల్ల‌ని వెన్నెలాయె”, “మ‌రీ అంత‌గా బిడియ‌మైతే” వంటి పాట‌లు విశేషాద‌ర‌ణ పొందాయి. 1970 ఏప్రిల్ 4న విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన ‘ఆలీబాబా 40 దొంగ‌లు’.. నేటితో 50 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

‘ఆలీబాబా 40 దొంగ‌లు’ – కొన్ని విశేషాలు:

• య‌న్టీఆర్ – విఠ‌లాచార్య‌ – య‌న్.రామ‌బ్ర‌హ్మం కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ప‌స్ట్ స‌క్సెస్‌ఫుల్ ఫోక్‌లోర్ మూవీ ‘ఆలీబాబా 40 దొంగ‌లు’.
• య‌న్టీఆర్, విఠ‌లాచార్య క‌ల‌యిక‌లో వ‌చ్చిన ప‌దో చిత్ర‌మిది. అంత‌కుముందు ‘బందిపోటు’, ‘అగ్గిపిడుగు’, ‘మంగమ్మ శపథం’, ‘అగ్గిబరాటా’, ‘పిడుగు రాముడు’, ‘చిక్కడు దొరకడు’, ‘గండికోట ర‌హ‌స్యం’, ‘క‌ద‌ల‌డు వ‌ద‌ల‌డు’, ‘ల‌క్ష్మీక‌టాక్షం’ వంటి చిత్రాలతో ట్రిపుల్ హ్యాట్రిక్‌ను సాధించింది ఈ ద్వయం.
• య‌న్టీఆర్, జ‌య‌ల‌లిత జంట‌గా న‌టించిన ఏడో సినిమా ఇది. ఈ చిత్రానికంటే ముందు ఈ జంట ‘గోపాలుడు భూపాలుడు’, ‘చిక్కడు దొరకడు’, ‘బాగ్దాద్ గజదొంగ’, ‘కథానాయకుడు’, ‘గండికోట ర‌హ‌స్యం’, ‘క‌ద‌ల‌డు వ‌ద‌ల‌డు’ వంటి డబుల్ హ్యాట్రిక్ మూవీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అలరించింది.
• ఈ చిత్రంలో జయలలిత ఓ పాటను స్వయంగా పాడారు. `చల్లచల్లని వెన్నెలాయె` అంటూ సాగే గీతాన్ని ఆమె గానం చేశారు. త‌న‌ కెరీర్ లో జ‌య‌ల‌లిత‌ పాడిన ఏకైక తెలుగు పాట‌ ఇదే కావ‌డం మ‌రో విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 5 =