సెన్సేషనల్ మూవీ ‘కేజీఎఫ్’తో నేషనల్ స్టార్‌గా ఎదిగాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. అందులో రాకీ భాయ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో.. ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ (కేజీఎఫ్ 2)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దసరాకి విడుదల కానున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సెట్స్‌పై ఉండగానే.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆఫర్ దక్కించుకున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం `పొన్నియన్ సెల్వన్` పేరుతో ఓ భారీ బడ్జెట్ మూవీని రూపొందిస్తున్న విషయం విదితమే. పాన్ ఇండియన్ ఫిల్మ్‌గా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తోంది. కాగా ఆమెకు బంధువుగా పాండ్య రాజు పాత్రలో దర్శనమివ్వనున్నాడట యష్. అంతేకాదు.. ఈ సినిమా కోసం 30 రోజుల కాల్షీట్స్ కేటాయించాడట యష్. త్వరలోనే యష్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరి.. జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఐష్, యష్.. ఈ భారీ బడ్జెట్ మూవీతో ప్రేక్షకులను ఏ మేరకు మెస్మరైజ్ చేస్తారో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: