సినీ కార్మికులకు సాయం చేయడానికి సినీ పరిశ్రమ నుండి ఒక్కొక్కరుగా ముందుకొచ్చి తమ వంతు సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి ఒక అడుగుముందుకేసి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కరోనా క్రైసిస్ పేరుతో ఒక ట్రస్ట్ పెట్టారు. ఇప్పటికే ఎంతో మంది వారికి అండగా నిలిచి విరాళాలు అందించారు. ఇప్పుడు తాజాగా వారి జాబితాలో నందమూరి బాలకృష్ణ కూడా చేరిపోయాడు.
కరోనాను అరికట్టడానికి గానూ 1 కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్ ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్ కు అందించారు. ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, కరోనా ని అరికట్టడంలో మనందరం ముందుకు రావాలని పేర్కొన్నారు.
Thank you dear brother #Balayya #NBK for donating 25 lacs to #CoronaCrisisCharity & 50 lacs each to Telangana & AP Govts. You proved ur generous heart goes out to the needy every time.ప్రతి కష్టసమయంలోను,ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే,మీరెప్పుడు తోడుంటారు pic.twitter.com/9IWMw3ovMn
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 3, 2020
ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో బాలయ్య అఘోరగా, ఫ్యాక్షనిస్ట్‌గా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. మరోవైపు ఈయన మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనన్ కోషియన్’ అనే రీమేక్‌లో నటించబోతున్నట్టు సమాచారం.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.