క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నంనిర్మిస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా గతంలో ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ ను అనుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ‘విరూపాక్ష’ టైటిల్ ను ఫిలిం చాంబర్ లో తాజాగా రిజిస్టర్ చేయించారట. అయితే ఇది పవన్ కల్యాణ్ సినిమా కోసమేనని వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మరోవైపు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. నిజానికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Happy Birthday To Pawan Kalyan | #HBDJanasenaniPawanKalyan | Pawan Kalyan | Telugu FilmNagar
03:12

Samantha CUTE Performance | Attarintiki Daredi Movie Scenes | Pawan Kalyan | Samantha | Trivikram
04:12

Pawan Kalyan Birthday | Celebs About Pawan Kalyan | #HBDPawanKalyan | #PSPK25 | Telugu Filmnagar
12:31

Trivikram Reveals Facts about Pawan Kalyan | Ala Vaikunthapurramuloo Press Meet | Allu Arjun | Pooja
01:02
Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.