యంగ్ హీరో సాయితేజ్ కి అచ్చొచ్చిన కథానాయికల్లో రాశీఖన్నా ఒకరు. `సుప్రీమ్`, `ప్రతి రోజూ పండగే` చిత్రాల్లో ఈ జోడీ కనువిందు చేసింది. కట్ చేస్తే.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… సాయితేజ్ కథానాయకుడిగా `ప్రస్థానం` ఫేమ్ దేవ కట్టా దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది. కాగా, ఇందులో ఒక కథానాయికగా నివేదా పెతురాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో మరో నాయికకు కూడా స్థానముందని, ఆ పాత్రలో రాశీఖన్నా నటించే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే రాశి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.




మరి.. `సుప్రీమ్`, `ప్రతి రోజూ పండగే`తో విజయాలు అందుకున్న తేజ్, రాశి.. రాబోయే చిత్రంతో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























