సెంటిమెంట్ డ్రామాగా బాల‌కృష్ణ‌, బి. గోపాల్ చిత్రం?

Blockbuster Pair Balakrishna And B Gopal Join Hands For A Wholesome Family Entertainer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Balakrishna,B Gopal,Balakrishna Latest News,Balakrishna New Movie Updates,Balakrishna Upcoming Film Updates,Balakrishna Latest Movie Details,Balakrishna Next Project News

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఏస్ డైరెక్ట‌ర్ బి. గోపాల్ సుదీర్ఘ విరామం త‌రువాత మ‌రోమారు జ‌ట్టుక‌డుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ ఈ సినిమాకి క‌థ‌ను అందిస్తున్నాడ‌ని, కుటుంబ బంధాల నేప‌థ్యంలో సాగే చిత్రంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని వినిపిస్తోంది. పెద్ద‌ల‌తో, త‌ల్లిదండ్రుల‌తో, తోడ‌బుట్టిన‌వాళ్ళ‌తో ఎలా న‌డుచుకోవాలో, వారిని ఎలా ట్రీట్ చేయాలో చెప్పే క‌థాంశంతో బాల‌య్య‌, బి.గోపాల్ కాంబినేష‌న్ మూవీ ఉంటుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా చెప్పాలంటే.. `శ‌త‌మానం భ‌వ‌తి` త‌ర‌హా క‌థ‌కి బాల‌య్య మార్క్ మాస్ ఎలిమెంట్స్, కామెడీ జోడించి సినిమాని తీర్చిదిద్దే ప‌నిలో ఉన్నార‌ట బి.గోపాల్ అండ్ టీమ్. కాగా, మే నెలాఖ‌రు నుంచి బాల‌కృష్ణ‌, బి. గోపాల్ కాంబినేష‌న్ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముందట‌. త్వ‌ర‌లోనే నాయిక‌, నిర్మాత వివ‌రాలు వెలువ‌డతాయని టాక్.

`లారీ డ్రైవ‌ర్`, `రౌడీ ఇన్స్ పెక్ట‌ర్`, `స‌మ‌రసింహారెడ్డి`, `న‌ర‌సింహ‌నాయుడు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ అయిన బాల‌య్య‌, బి.గోపాల్ కాంబినేష‌న్.. రాబోయే చిత్రంతో ఏ స్థాయిలో రంజింప‌జేస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.