మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా.. బాక్సాఫీస్ వద్ద ఈ ముగ్గురిది కూడా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే చెప్పాలి. `అభిలాష`(1983)తో మొదలైన ఈ త్రయం సందడి… `కొండవీటి దొంగ` (1990) వరకు విజయవంతంగా సాగింది. అలాంటి ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం `కొండవీటి దొంగ`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిరంజీవి టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో విజయశాంతి, రాధ నాయికలుగా నటించగా.. ఇతర ముఖ్య పాత్రల్లో మోహన్ బాబు, అమ్రిష్ పురి, రావుగోపాల రావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, నాగబాబు, శారద, శ్రీవిద్య, దివ్యవాణి దర్శనమిచ్చారు. ఇళయరాజా స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. `శుభలేఖ రాసుకున్నా`, `కోలో కోలమ్మ`, `చమక్ చమక్`, `శ్రీ ఆంజనేయం`, `జీవితమే ఒక ఆట`, `టిప్ టాప్`, `దేవీ శాంభవి`.. ఇలా ప్రతీ పాట ఓ ఆణిముత్యమే. వీటిలో `శుభలేఖ రాసుకున్నా`, `చమక్ చమక్` రీమిక్స్ బాట పట్టగా.. వాటికి యువ సంగీత సంచలనం థమన్ నే బాణీలు కట్టడం విశేషం. శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది.
1990 మార్చి 9న విడుదలైన `కొండవీటి దొంగ`… నేటితో 30 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: