`డాన్సింగ్ క్వీన్` రీమేక్ లో కాజ‌ల్ అగ‌ర్వాల్?

Actress Kajal Aggarwal,Kajal Aggarwal To Act In Korean Movie Remake,Latest Telugu Movies News,Telugu Film Updates 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Korean Movie Remake,Kajal Aggarwal,Kajal Aggarwal Latest News 2020,Kajal Aggarwal Upcoming Movie Updates,Kajal Aggarwal Korean Movie

తెలుగునాట ఇప్పుడు కొరియ‌న్ మూవీస్ రీమేక్ ట్రెండ్ న‌డుస్తోంది. రీసెంట్ గా రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించిన `ఓ బేబి`తో ఈ ట్రెండ్ మ‌రింత ఊపు అందుకుంది. కొరియ‌న్ ఫిల్మ్ `మిస్ గ్రానీ`(2014) ఆధారంగా రూపొందిన ఈ సోషియో ఫాంట‌సీ మూవీ.. న‌టిగా స‌మంత‌కి ఎన‌లేని గుర్తింపు తెచ్చింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు సామ్ బాట‌లోనే ప‌య‌నించేందుకు మ‌రో అగ్ర క‌థానాయిక సిద్ధ‌మైంది. ఆమె మ‌రెవ‌రో కాదు.. టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ఓ బేబి` నిర్మాతల్లో ఒక‌రైన డి.సురేష్ బాబు.. మ‌రో రెండు కొరియ‌న్ మూవీస్ ని తెలుగులో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. వాటిలో ఒక‌టైన `మిడ్ నైట్ ర‌న్న‌ర్స్`(2017) ని రెజీనా, నివేదా థామ‌స్ కాంబినేష‌న్ లో చేయ‌నున్న సురేష్.. మ‌రొక‌టైన `డాన్సింగ్ క్వీన్` (2012)ని కాజ‌ల్ అగ‌ర్వాల్ తో నిర్మించ‌నున్నార‌ట‌. అంతేకాదు.. ఈ రీమేక్ లో కాజల్ తో పాటు `అల్ల‌రి` న‌రేష్ కూడా న‌టిస్తాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి.. `ఓ బేబి`తో సామ్ మెస్మ‌రైజ్ చేసిన‌ట్టే.. `డాన్సింగ్ క్వీన్`గా కాజ‌ల్ కూడా త‌న‌దైన ముద్ర వేస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 11 =