`పడి పడి లేచె మనసు`లో జంటగా నటించి కనువిందు చేశారు శర్వానంద్, సాయిపల్లవి. కమర్షియల్ గా ఆ చిత్రం నిరాశపరిచినా… తమ పెర్ ఫార్మెన్స్ తో మాత్రం మెప్పించారు. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం ఈ ఇద్దరూ మరోసారి జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `నేను శైలజ`, `ఉన్నది ఒకటే జిందగీ`, `చిత్ర లహరి`తో ఫీల్ గుడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన కిషోర్ తిరుమల త్వరలో ఓ యూత్ ఎంటర్ టైనర్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులోనే శర్వా, పల్లవి జోడీకట్టనున్నారట. అంతేకాదు.. `పడి పడి లేచె మనసు` నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ చెరుకూరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తాడని సమాచారం. మే నెలాఖరులో లేదా జూన్ ఆరంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని టాక్.
కాగా, ప్రస్తుతం కిషోర్ తిరుమల `రెడ్`తోనూ, సాయిపల్లవి `లవ్ స్టోరి`, `విరాట పర్వం`తోనూ, శర్వానంద్ `శ్రీకారం`తోనూ బిజీగా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: