మంగ్లీ ‘స్వేచ్ఛ’ రిలీజ్ డేట్ ఫిక్స్

Singer Mangli Swecha Movie Gets Final Release Date

తీన్మార్ వార్తలతో టీవీ ప్రేక్షకులకు పరిచయమైన.. ఆ తర్వాత ‘బతుకమ్మ’ పాటలతో.. ఆ తర్వాత సినిమాల్లో పడే అవకాశం దక్కించుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది మంగ్లీ. ఇప్పుడు ఏకంగా తాను ప్రధాన పాత్రలో ఓ సినిమాలో కూడా నటించింది. కెపీఎన్‌. చౌహన్‌ దర్శకత్వంలో మంగ్లీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘స్వేచ్ఛ’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆడపిల్ల పుడితే చాలు అమ్మో అనుకుంటూ అమ్మేస్తున్న సమాజమిది. అలా అమ్మకానికి గురై అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది? ఆమె ఏంసాధించింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ఇది. ప్రస్తుతం అన్ని పనులు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సరస్వతి డెవలపర్స్‌, లచ్చురాం ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆంగోత్‌ రాజునాయక్‌ దీన్ని నిర్మించారు.

[custom_ad]

ఇక ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. తండా స్థాయి నుండి ప్రపంచస్థాయి వరకు గాయనిగా ఎదిగిన మంగ్లీ ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషించింది. ఆమె పాత్ర నేటి అమ్మాయికు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. సెంటిమెంట్‌, వినోదం మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది. పాపికొండలతో పాటు… అందమైన లోకేషన్లలో చిత్రీకరణ చేశాం’ అని తెలిపారు. ‘ఒక మంచి పాత్రలో నటించడంతో పాటు సంగీతం అందించడం ఆనందంగా ఉందని’ భోలో షావలి తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో, ఈ సృష్టికి ఆడపిల్ల అంతే ముఖ్యమని తెలిపే చిత్రమిది. ఆడప్లిను పురిటిలోనే చంపకుండా వారిని చదివించి, ప్రయోజకులను చేస్తే ఏ రంగంలో వాళ్లు తీసిపోరనే అద్భుతమైన కథాంశమిది. మంగ్లీ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. హాస్య నటుడు చమ్మక్‌ చంద్ర ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించాడని తెలిపారు. ‘బంజారే బంజారే..’ పాటను సింగర్‌ మంగ్లీ అద్భుతంగా ఆపించినట్లు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.