ప్రభు దేవా "బఘీర"తమిళ మూవీ ఫస్ట్ లుక్
Ace Dancer Prabhu Deva Tamil Movie Bagheera First Look Is Out
భరతన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా మిస్టరీ థ్రిల్లర్ "బఘీర"తమిళ మూవీ రూపొందుతుంది. ప్రభుదేవా 55 వ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో అమైరా దస్తూర్ కథానాయిక. గణేశన్ శంకర్ సంగీతం అందించిన "బఘీర" మూవీ 70 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని సమాచారం.
"బఘీర" మూవీ లో ప్రభుదేవా ఫస్ట్ లుక్ పోస్టర్ ను వాలెంటైన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. డిఫరెంట్ గా ఉన్న పోస్టర్ ఆసక్తి ని కలిగించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు మాట్లాడుతూ .. జంగిల్ బుక్ లోని "బఘీర" కు ప్రభుదేవా క్యారెక్టర్ కు దగ్గర పోలిక ఉంటుందని తెలిపారు."బఘీర" మూవీ ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేసిందని, చిత్ర యూనిట్ కు అభినందనలు అని హీరో ధనుష్ ట్వీట్ చేశారు.







