పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలచిన చిత్రాల్లో `ఖుషి` ఒకటి. ఆ సినిమాతోనే నటి భూమికా చావ్లాకి కథానాయికగా భారీ విజయం దక్కింది. అంతటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత పవన్, భూమిక కాంబినేషన్ లో మరో సినిమా రానేలేదు. అయితే, త్వరలోనే ఈ జోడీ మరోమారు జట్టుకట్టబోతున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




ఆ వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఓ పిరియాడికల్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు నాయికలకు స్థానముంది. అలాగే కథను కీలక మలుపు తిప్పే ఓ ముఖ్య పాత్ర కూడా ఉందట. ఆ పాత్రలోనే భూమిక నటించబోతోందట. ఏదేమైనా, భూమిక పాత్రకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే… `ఖుషి` చిత్రాన్ని నిర్మించిన ఎ.ఎం. రత్నంనే ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నాడు. మరి.. `ఖుషి` సెంటిమెంట్ కొత్త చిత్రానికి కూడా వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: