అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో.. వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో.. మహేష్ బాబు కు ఫ్రెండ్ గా కీలక పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో అవకాశాలు వచ్చినా అల్లరి నరేష్ మాత్రం మరోసారి హీరోగానే వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నరేష్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఓ కాన్సెప్ట్-ఓరియెంటెడ్ సినిమాతో నరేష్ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలింది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది.
[custom_ad]
కాగా ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల అందిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి సమ్మర్లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
మరి గతంలో అల్లరి నరేష్ సినిమాలు అన్నీ కామెడీ తోనే ఉండేవి. కానీ ఇప్ప్పుడు టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. మరి గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతవుతున్న అల్లరి నరేష్ ఈ సినిమాతో అయినా తిరిగి ఫామ్ లోకి వస్తాడేమో.. ఈ ‘నాంది’ సినిమాతో అయినా కొత్త జర్నీ కి ‘నాంది’ పలుకుతాడేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: