`రంగ‌స్థ‌లం` రికార్డుని బ‌ద్ద‌లు కొట్టిన `అల వైకుంఠ‌పుర‌ములో`

Ala Vaikunthapurramuloo Breaks Rangasthalam Records

సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన `అల వైకుంఠ‌పుర‌ములో` క‌లెక్ష‌న్ల ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌చిన ఈ సినిమా… ప‌లు చోట్ల `నాన్ – బాహుబ‌లి` రికార్డుల‌ను మూట‌గ‌ట్టుకుంది. కొన్ని చోట్ల (తాజాగా నైజాంలో కూడా) అయితే `బాహుబ‌లి – ది బిగినింగ్` రికార్డుల‌ను కూడా అధిగ‌మించి విస్మ‌య‌ప‌రిచింది. ఈ ఊపులోనే.. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఖాతాలో మ‌రో అరుదైన రికార్డు వ‌శ‌మైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

అదేమిటంటే.. యు.ఎస్. హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ లో ఇప్ప‌టివ‌ర‌కు `బాహుబ‌లి` చిత్రాల త‌రువాత స్థానంలో (మూడో స్థానం) ఉన్న `రంగ‌స్థ‌లం` రికార్డుని ఈ వీకెండ్ లో అధిగమించింది `అల వైకుంఠ‌పురములో` చిత్రం. `రంగ‌స్థ‌లం` లైఫ్ టైమ్ క‌లెక్ష‌న్ల‌ని (3.513 మిలియ‌న్ డాల‌ర్లు) కేవ‌లం మూడు వారాల్లో `అల‌…` క్రాస్ చేయ‌డం విశేషం. మ‌రి.. ఫుల్ ర‌న్ లో `అల‌..` ఖాతాలో ఇంకెన్ని రికార్డులు వ‌శ‌మ‌వుతాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =