సూర్య‌కి జోడీగా ర‌ష్మిక‌?

Rashmika Mandanna Teams Up With Suriya

అన‌తికాలంలోనే క‌న్న‌డ‌, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో అగ్ర క‌థానాయిక‌గా పేరు తెచ్చుకుంది చంద‌న‌సీమ చిన్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. ఈ రెండు చోట్లా క్రేజీ ఆఫ‌ర్ల‌ను మూట‌గ‌ట్టుకుంటూనే.. మ‌రోవైపు కోలీవుడ్ పై కూడా క‌న్నేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఇప్ప‌టికే `ఖైదీ` కార్తి స‌ర‌స‌న `సుల్తాన్` అనే చిత్రంలో న‌టిస్తున్న ర‌ష్మిక‌.. తాజాగా అత‌ని అన్న సూర్య‌తోనూ క‌ల‌సి న‌టించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంద‌ని త‌మిళ చిత్ర వ‌ర్గాల స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆ వివ‌రాల్లోకి వెళితే.. సూర్య‌తో `య‌ముడు` సిరీస్ రూపొందిస్తూ వ‌స్తున్న హ‌రి.. త్వ‌ర‌లో మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉన్న స‌ద‌రు క్రేజీ ప్రాజెక్ట్… ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప‌ట్టాలెక్క‌నుంది.. కాగా, ఈ చిత్రంలో సూర్యకి జోడీగా ర‌ష్మిక‌ని ఎంపిక చేశాడ‌ట హ‌రి. మ‌రి.. అన్న‌ద‌మ్ముల‌తో బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్ల‌ను అందిపుచ్చుకున్న ర‌ష్మిక‌.. ఆ యా చిత్రాల‌తో ఏ స్థాయి విజ‌యాల‌ను అందుకుంటుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 17 =